Best book in telugu RICH DAD POOR DAD

జీవితంలో పైకి ఎదగాలి అనే ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం  రిచ్ డాడ్ పూర్ డాడ్. జీతంలో డబ్బు ముఖ్యం కాదు ప్రేమే ముఖ్యం అనే ఆలోచన చేతకాని వాళ్ల భావన అని ఈ పుస్తక రచయిత రాబర్ట్ కియోసకి చెప్పారు.

 పేదలూ , మధ్యతరగతి తలిదండ్రులు నేర్పించనిది ధనికులు డబ్బు గురించి తమ పిల్లలకి నేర్పించేదేమిటి ? అనే ప్రశ్నకు సమాధానం ఈ పుస్తకంలో దొరుకుతుంది.

ఈ పుస్తకం గురించీ కొంతమంది చెప్పిన మాటలు చూద్దాం.

“ మీరు గొప్ప ధనవంతులై అందరికన్నా ఎత్తులో ఉండాలనుకుంటే మీరు ' రిచ్ డాడ్ , పూర్ డాడ్ ' తప్పక చదవాలి . దీనివల్ల మీకు మార్కెట్టుని గురించీ , డబ్బుని గురించి వ్యావహారిక జ్ఞానం పెరుగుతుంది . ఆ విధంగా ఆర్థికంగా భవిష్యత్తులో మీరు బాగుపడగలుగుతారు" .

 * జిగ్ జిగ్లర్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రచయిత , లెక్చరర్



“ వ్యక్తిగతంగా ధనం సంపాదించి , ఆ ధనాన్ని నిలబెట్టుకోవటం గురించిన రహస్యాలూ , తెలివితేటలూ కావాలనుకుంటే , ఈ పుస్తకం చదవండి ! తప్పనిసరి అనుకుంటే మీ పిల్లలకి దీన్ని చదవటానికి , లంచం (కావాలంటే డబ్బు రూపంలో ) ఇవ్వండి ".

 * మార్క్ విక్టర్ హేన్ సెన్ సహరచయిత , న్యూయార్క్ టైమ్స్ నంబర్ వన్ బెస్ట్ సెల్లింగ్ చికెన్ సూప్ ఫర్ ది సాలో సీరీస్ 



" రిచ్ డాడ్ పూర్ డాడ్ మామూలుగా డబ్బు గురించి మీరు చదివేలాంటి పుస్తకం కాదు ... రిచ్ డాడ్ పూర్ డాడ్ చదవటానికి సులభశైలిలో ఉంటుంది - ఇందులో కీలకమైన సందేశాలున్నాయి - ధనవంతులు కావాలనుకుంటే ఏకాగ్రతా , ధైర్యమూ ఉండాలంటాడు రచయిత - ఇవి చాలా సులభంగా పాటించగల సలహాలు . "

* హొనలులూ మాగజైన్



 “ నేను చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడే ఈ పుస్తకం చదివుంటే బాగుండేదని అనుకుంటాను . అసలు నా తలిదండ్రులు దీన్ని చదివుంటే ఇంకా బావుండేదేమో ! మీ పిల్లలందరికీ ఒక్కొక్క కాపీ కొని ఇవ్వదగిన పుస్తకమిది . కొన్ని కాపీలు అదనంగా కొని ఉంచుకుంటే 8-9 ఏళ్లు రాగానే మీ మనవలకి కూడా వాటిని బహూకరించవచ్చు" .

* స్యూ బ్రాన్ ప్రెసిడెంట్ , టెనెంట్ చెక్ ఆఫ్ అమెరికా




 “ రిచ్ డాడ్ పూర్ డాడ్ త్వరగా ధనవంతులెలా అవగలమో చెప్పదు . మీరు మీ ఆర్థిక వ్యవహారాల బాధ్యత ఎలా వహించాలో , డబ్బు మీద అధికారాన్ని సాధించి మీ ఆస్తిపాస్తుల్ని ఎలా మెరుగుపరుచుకోవాలో చెబుతుంది . మీలోని ఆర్థిక ప్రతిభని చైతన్యవంతం చెయ్యాలనుకుంటే దీన్ని చదవండి . "

 * డా ॥ ఎడ్ కోకెన్ ఆర్థికశాస్త్రంలో లెక్చరర్ , ఆర్.ఎమ్.ఐ.టి. విశ్వవిద్యాలయం , మెల్ బోర్న్




 “ నేనీ పుస్తకాన్ని ఇరవై ఏళ్ల క్రితం చదివి ఉండాల్సిందని అనుకుంటున్నాను . "

 * లారిసన్ క్లార్క్ , డైమండ్ కీ హోమ్స్ అమెరికాలోని అతివేగంగా పెరుగుతున్న భవన నిర్మాత , ఇస్క్ . ( INC ) మేగజైన్ , 1995



 “ భవిష్యత్తులో ధనవంతులు అవాలనుకుంటున్న వారందరూ రిచ్ డాడ్ పూర్ డాతో మొదలు పెట్టాలి ".

 * యూ.ఎస్.ఏ. టుడే



ఈ పుస్తకం నుంచి మనం నేర్చుకునే పాఠాలు 6

పాఠం ఒకటి : ధనవంతులు ఎప్పుడూ డబ్బుకోసం పనిచెయ్యరు

పాఠం రెండు : ఆర్థిక అక్షరాస్యత ఎందుకు నేర్పాలి ?

పాఠం మూడు : నీ పని నువ్వు చేసుకో

పాఠం నాలుగు : పన్నుల చరిత్ర కార్పొరేషన్ల శక్తి

పాఠం ఐదు : ధనికులు డబ్బుని సృష్టిస్తారు

పాఠం ఆరు : నేర్చుకునేందుకు పని చెయ్యండి - డబ్బుకోసం పని చెయ్యకండి



మళ్లీ ఒక సరి గుర్తు చేస్తున్నా మనం ఎదగాలంటే ఈ పుస్తకం లో వున్న జ్ఞానం మనం సంపాదించి తీరాలి.

Buy in given link
https://amzn.to/3gL5ACm

Comments

Popular posts from this blog

రక్తాంచల్ ( RAKTANCHAL ) review in telugu